NTV Telugu Site icon

Rahul Gandhi: ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ ’’.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బడ్జెట్‌ని ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్’’ అని విమర్శించారు. ప్రభుత్వానికి ‘‘దివాళా ఆలోచన’’తో బాధపడుతోందని అన్నారు. ఎక్స్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. ‘‘ప్రపంచ అనిశ్చితి మధ్య, మన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక నమూనా మార్పు అవసరం. కానీ ప్రభుత్వం ఆలోచన దివాళా తీసింది’’ అని రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి భారీ కేటాయింపులపై రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలబెట్టిన కీలకమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ని విస్మరించారని ఆరోపించారు.

Read Also: Budget 2025: బడ్జెట్‌లో మాల్దీవులకు పెరిగిన సాయం.. భూటన్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే.?

బడ్జెట్‌పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా విమర్శలు గుప్పించారు. ‘‘ తొమ్మిది వందల ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి హజ్‌కి వెళ్లింది’’ అంటూ బడ్జెట్‌ని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో మధ్యతరగతి వర్గం నుంచి కేంద్రం రూ. 54.18 లక్షల కోట్లు ఆదాయపు పన్ను వసూలు చేసిందని, ఇప్పుడు 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చిందని మండిపడ్డారు. దీని ప్రకారం ఏడాదికి రూ.80,000 ఆదా అవుతాయని ఆర్థిక మంత్రి చెబుతున్నారని, అంటే నెలకు రూ.6666 మాత్రమే అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. యువతకు, మహిళా సాధికారతకు బడ్జెట్‌లో ఏమీ లేదని, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల, పేద మరియు మైనారిటీ పిల్లలకు ఆరోగ్యం, విద్య లేదా స్కాలర్‌షిప్ కోసం ఎటువంటి ప్రణాళిక లేదని ఆరోపించారు. ప్రజల్ని మోసం చేయడాని మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నమే ఈ బడ్జెట్ అంటూ విమర్శించారు.