Bajrang Dal men heckle inter-faith couple: కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరంగా సున్నిత అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ‘హిజాబ్’ వివాదం, హలాల్ వివాదాలు గతంలో జరిగాయి. తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న మతాంతర జంటపై హిందూ సంస్థ భజరంగ్ దళ్ కు చెందిన ఓ వ్యక్తి దాడి చేశాడు. హిందు యువతి, ముస్లిం యువకుడు ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు దక్షిణ కన్నడ జిల్లాలో ఓ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో భజరంగ్ దళ్ కార్యకర్త ఈ జంటపై దాడి చేశారు.
Read Also: PM Narendra Modi: ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
దక్షిణ కన్నడ జిల్లా నుంచి బెంగళూర్ కు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ఆపి దాడికి యత్నించారు. వీరిద్దరు బార్ కౌన్సిల్ ఎగ్జామ్ రాసేందుకు రాజధాని బెంగళూర్ వెళ్తున్నారు. బెంగళూర్ వెళ్తున్న వీరని అడ్డుకున్న సదరు వ్యక్తి హల్చల్ సృష్టించారు. బస్సులోకి ప్రవేశించిన వ్యక్తి జంటను ప్రశ్నించారు. బాధిత యువతి, వ్యక్తి బ్యాచిలర్ ఆఫ్ లా పట్టా పొందారు. బార్ కౌన్సిల్ ఎగ్జామ్ కోసం వెళ్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ వెల్లడించారు.
