IndiGo Plane Incident: గాలిలో విమానం.. చావుబతుకుల మధ్య పసికందు.. ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Plane Incident: గాలిలో విమానం, తీవ్రమైన గుండె జబ్బులో బాధపడుతున్నఆరునెలల పసికందు, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. చావుబతుకుల సమస్య. కానీ అప్పుడే ఓ అద్భుతం జరిగింది. పసికందు ప్రయాణించే విమానంలోనే ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. వారే చిన్నారి ప్రాణాలను నిలబెట్టారు. ఇందులో ఒక డాక్టర్ ఐఏఎస్ ఆఫీసర్. చిన్నారి పరిస్థితిని తెలుసుకుని అత్యవసరంగా చికిత్స అందించారు.
పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్న శిశువుకు రాంచీ నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో తీసుకెళ్తున్నారు. విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత ఎయిర్ సిబ్బంది చిన్నారి పరిస్థితిపై ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ చేశారు. అదే విమానంలో ఐఏఎస్ ఆఫీసర్‌గా గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన డాక్టర్ కులకర్ణి, రాంచీలోని సదర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ మొజిమిల్ ఫెరోజ్ ఉన్నారు.
Also Read
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
Read Also: Uttar Pradesh: “నాపై చేతబడి చేస్తున్నారు”.. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
వీరిద్దరు చిన్నారికి ఫ్లైట్ లో ఉండే ఆక్సీజన్ మాస్క్ ద్వారా ఆక్సీజన్ అందించారు. ఎమర్జెన్సీ కిట్ లో ఉండే అత్యవసర మెడిసిన్స్ వాడి పసికందు పరిస్థితిని చక్కదిద్దారు. శిశువుకు పట్టుకతో వచ్చే హర్ట్ కండిషన్, పెటెంట్ డక్టస్ ఆర్టెరియోసన్(పీడీఏ) ఉందని, దాని కోసమే వారు ఢిల్లీలోని ఎయిమ్స్ కి వెళ్తున్నారని డాక్టర్ కులకర్ణి చెప్పారు. డ్రగ్ కిట్ లో ఉండే థియోఫిలిన్ ఇంజెక్షన్ ఇచ్చామని, బిడ్డ తల్లిదండ్రులు డెక్సోనా ఇంజెక్షన్ తీసుకెళ్తున్నారని, ఇది చాలా సహాయకారిగా పనిచేసిందని డాక్టర్లు చెప్పారు.
చికిత్స తర్వాత పసికందు పరిస్థితి నెమ్మనెమ్మదిగా మెరుగైందని, మొదటి 15-20 నిమిషాలు చాలా కీలకం, ఒత్తడితో కూడుకున్నవని, చివరకు పసికందు కళ్లు తెరిచి సాధారణ స్థితికి వచ్చాయని, క్యాబిన్ సిబ్బంది కూడా చాలా సాయం చేశారని డాక్టర్ కులకర్ణి తెలిపారు. ల్యాండింగ్ కాగానే వైద్య సాయం కోరామని ఆయన తెలిపారు. ఉదయం 9.25 గంటలకు విమానం ల్యాండ్ కావడంతో శివువుకి ఆక్సిజన్ సపోర్టు అందించారని, మా ప్రయత్నాలు సఫలం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు.
#Doctors are God sent angles. Today saw one saving a 6 month old baby onboard #Indigo . Dr. Nitin Kulkarni, IAS, governor house @jhar_governor took on his role as a doctor and saved the kid. Salute to you sir. @JharkhandCMO @HemantSorenJMM .@jmm__ranchi
— A.S.Deol(Butter Singh) JMM (@ButterSDeol) September 30, 2023
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!