Site icon NTV Telugu

Amarnath Yatra: కరిగిపోతున్న మంచు లింగం.. నిరాశలో భక్తులు..!

Amrnath

Amrnath

Amarnath Yatra: జమ్ము కశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రకు భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే, తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక న్యూస్ వినిపిస్తుంది. అమర్‌నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి వల్ల మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది. దీంతో భక్తులు మహా శివలింగాన్ని దర్శించుకోలేని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. గుహలో నెలకొన్న ప్రతికూల వాతావరణం వల్ల ఈరోజు (శనివారం) అమర్‌నాథ్ యాత్ర బల్తాల్, పహల్గాం రెండు మార్గాలలోనూ వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన వెంటనే ఈ యాత్ర స్టార్ట్ కానుందని సంబంధిత అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్‌ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.

Read Also: Belly Fat : బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బందులా.. అయితే ఇలా చేయండి నాజూకుగా మారండి..

అయితే, తాజాగా పవిత్ర గుహలోని మంచు శివలింగం పూర్తిగా కరిగిపోతుండటంతో యాత్రికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో మంచు కరిగే ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెప్పుకొచ్చారు. యాత్ర స్టార్ట్ అయినా.. 10 రోజుల్లోనే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడం 2008 తర్వాత ఇప్పుడే చోటు ఇలా జరిగిందిన్నారు. ఈ సంవత్సరం అమర్‌నాథ్‌ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19వ తేదీన ముగియనుంది.

Exit mobile version