Site icon NTV Telugu

Azerbaijan: భారత ఆయుధాలను చూసి భయపడుతున్న అజర్‌బైజాన్.. ఆర్మేనియాకు పంపొద్దని విజ్ఞప్తి

Armania

Armania

Azerbaijan: ఇకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఆర్మేనియా, అజర్‌బైజాన్ చిరకాల ప్రత్యర్థులుగా మారాయి. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. నగోర్నో-కరబాఖ్‌ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం గడచిన మూడు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య చెదురుమదురు సంఘర్షణలు జరుగుతూనే వచ్చాయి. అయితే, కాశ్మీర్ అంశంతో పాటు పలు సమస్యలపై భారత్‌కి మద్దతు తెలిపే ఆర్మేనియాకు మన దేశం ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఇది అజర్‌బైజాన్‌కి నచ్చడం లేదు.

తమ ప్రత్యర్థి ఆర్మేనియాకు దూరంగా ఉండాలని రక్షణ పరికరాలను సరఫరా చేయవద్దని భారత్‌ని అజర్‌బైజాన్ కోరింది. జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ బాకులో మాట్లాడుతూ.. ఫ్రాన్స్, ఇండియా, గ్రీస్ దేశాలు తమకు వ్యతిరేకంగా ఆర్మేనియాకు ఎలా ఆయుధాలు సరఫరా చేస్తున్నాయో చూస్తున్నాము, దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా ఉండలేము, ఈ వైఖరిని ఆర్మేనియా ప్రభుత్వానికి, ఆర్మేనియాను జాగ్రత్తగా చూసుకోవాలనే వారికి బహిరంగంగా వ్యక్తం చేశాము. పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Read Also: Pakistan: ‘‘బంగ్లాదేశ్‌ని చూస్తుంటే సిగ్గుగా ఉంది’’.. పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..

ఇటీవల కాలంలో ఆర్మేనియా తన రక్షన సామర్థ్యాలను పెంచుకుంటోంది. స్వల్ప శ్రేణి క్షిపణులను, డ్రోన్లను దెబ్బతీసే వ్యవస్థలతో సహా అధునాతన ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ముఖ్యంగా ఇండియా నుంచి పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్‌ వ్యవస్థను, ఆకాశ్ క్షిపణులను కొనుగోలు చేసింది. మా భద్రతకు ముప్పు ఉన్నప్పుడు ఆందోళన చెందే హక్కు తమకు ఉందని అజర్‌బైజాన్ చెప్పింది. ఈ ప్రాంతంలో తన ప్రయోజనాల కోసం ఆర్మేనియాకు సైనిక ఆయుధాలను పంపవద్దని అజర్ బైజాన్ అధ్యక్షుడు అలీయేవ్ బహిరంగంగా పలు దేశాలను కోరాడు.

ఆర్మేనియాకి భారత రక్షణ సామాగ్రి సరఫరాపై అజార్‌బైజాన్ ఆందోళన చెందుతోంది. జూలై 2023లో తమ ఆందోళనల్ని మొదటిసారిగా లేవనెత్తింది. అజర్‌బైజాన్ విదేశీ విధాన వ్యవహారాలపై అజైర్ ప్రెసిడెంట్ అసిస్టెంట్ హిక్మత్ హజీయేవ్ భారత రాయబారి మధు శ్రీధరన్‌తో బాకులో సమావేశమయ్యారు. ఆర్మేనియాతో భారత్ సైనిక సహకారాన్ని పెంచుకోవద్దని కోరారు. తమ ఆందోళనల్ని ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లాని కోరారు. దీనికి ముందు అజర్ బైజాన్ అధ్యక్షుడు గతేడాది మేలో భారత రాయబారిని ఓ కార్యక్రమంలో కలిసినప్పడు ఆర్మేనియా ఆయుధాల కోనుగోలును హైలెట్ చేశారు. అజర్‌బైజాన్‌తో శాంతిని కోరుకుంటే ఆర్మేనియా 100 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఎందుకు కొనుగోలు చేసిందని ప్రశ్నించారు.

భారత ఆయుధాలనే కాకుండా, ఆర్మేనియా 2023లో ఫ్రెంచ్‌కి చెందిన థేల్స్ గ్రౌండ్ మాస్టర్ 200 రాడార్ సిస్టమ్ కొనుగోలు చేసింది. త రెండు సంవత్సరాల్లో దాని రక్షణ బడ్జెట్‌ను 2022లో 700-800 మిలియన్ డాలర్ల నుండి 2024 నాటికి 1.45 బిలియన్ల డాలర్లకు గణనీయంగా పెంచింది. అజార్‌బైజాన్ పిలుపుకు భారత్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు అజార్‌బైజాన్‌కి టర్కీతో పాటు పాకిస్తాన్ బలమైన మద్దతుదారులుగా ఉన్నాయి.

Exit mobile version