NTV Telugu Site icon

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడికి వేల కోట్లలో విరాళాలు.. ఇప్పటి వరకు లెక్క ఎంతంటే..

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి వేల కోట్లలో విరాళాలు వస్తున్నాయి. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మితమైన సంగతి తెలిసిందే. ఒక్క మనదేశం నుంచే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి విరాళాలు వస్తున్నాయి. గత 10 నెల్లలో రూ. 11 కోట్ల విదేశీ విరాళాలతో పాటు గత మూడేళ్లలో అయోధ్య రామమందిరానికి బంగారం, వెండితో సహా రూ. 2000 కోట్లకు పైగా విరాళాలు అందాయి. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు రూ.5500 కోట్ల భారీ విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: 100 Variety Foods: 100 రకాల పిండి వంటలతో అల్లుడికి ఘనస్వాగతం పలికిన అత్తమామలు..

ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో చారిత్రాత్మక రామమందిరానికి 2020లో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. 2021 ఆలయ నిర్మాణం కోసం నిధుల ప్రచారంలో రూ. 3500 కోట్లు వచ్చాయి. అయోధ్య రామమందిర్ ట్రస్ట్ దేశం, అంతర్జాతీయంగా ప్రతి భాగం నుండి విరాళాలు అందించిన వారికి 10,000 పైగా రసీదులను ముద్రించింది. ఈ ఏడాది జనవరిలో అట్టహాసంగా ఆలయం ప్రారంభమైంది. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ఆలయాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నాటికి కొత్తగా నిర్మించిన ఆలయానికి 25 కేజీల బంగారం, వెండి ఆభరణాలతో సహా దాదాపు రూ. 25 కోట్ల విరాళాలు వచ్చాయి.

శంకస్థాపన కార్యక్రమం తర్వాత నుంచి భక్తులు రామ్ లల్లాకు విరాళాలు ఇస్తున్నారు. అయితే, ఆలయం ప్రారంభం తర్వాత నుంచి విరాళాల్లో వేగం పెరిగింది. ఆలయానికి రోజూ లక్షల్లో విరాళాలు వస్తున్నాయి. అయోధ్య రామమందిర ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థ ద్వారా కూడా భక్తులు విరాళాలను అందిస్తున్నారు. అలాగే బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను భౌతిక రూపాల్లో విరాళాలుగా ఇస్తున్నారు. డిపాజిట్లతో పాటు చెక్కు, డ్రాఫ్ట్‌లు మరియు నగదు విరాళాలతో సహా అన్ని రూపాల్లో ట్రస్ట్ విరాళాలను స్వీకరిస్తుందని రామమందిర్ ట్రస్ట్ ఆఫీస్ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు.