Site icon NTV Telugu

Ayodhya Ram Mandir: అయోధ్యకు బయలుదేరిన 42 గుడి గంటలు.. ఒక్కొక్కటి 2 నుంచి 2.5 టన్నుల బరువు

Ram Mandir Temple Bell

Ram Mandir Temple Bell

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఆలయ కమిటీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రామాలయ ప్రారంభానికి నెల రోజులే సమయం ఉండటంతో తమిళనాడు నమక్కల్ నుంచి 42 గుడి గంటలు అయోధ్యకు బయలుదేరాయి. భారీ లారీలో వీటిని తరలిస్తున్నారు. గుడి గంటలను చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఈ గుడి గంటలు 2 టన్నుల బరువు కలిగి ఉన్నాయి.

Also Read: Payal Ghosh: సలార్ ఒక చెత్త సినిమా.. ఆ పని చేస్తుంటే ఎన్టీఆర్ నన్ను తిట్టాడు

వీటిలో ఒకటి 2.5 టన్నుల బరువైన గంట కూడా ఉంది. ఈ సందర్భంగా అక్కడ జై శ్రీరాంఅంటూ భక్తుల నినాదాలు మార్మోగాయి. అయోధ్య రామాలయ గర్భాలయంపై మోగనున్న గంటను కూడా తమిళనాడులోనే రూపొందించారు. కాగా ఈ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ కురువృద్ధుడు శ్రీ ఎల్‌కే అద్వానీకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. అలాగే దేశ వ్యా్ప్తంగా ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులకు ఆలయ కమిటీ ఆహ్వానాలు పంపుతోంది. అలాగే దేశ నలుమూలల ఉన్న భక్తులకు రామమందిర ప్రారంభోత్సవానికి అనుమతి ఉండటంతో భారీ ఎత్తున తరలివెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా బందోబస్తు, భద్రత ఏర్పాట్లకు యూపీ ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: Telangana: తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం

Exit mobile version