NTV Telugu Site icon

Ayodhya gangrape: గ్యాంగ్ రేప్ నిందితుకు డీఎన్ఏ టెస్ట్ డిమాండ్.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ వ్యాఖ్యలపై దుమారం..

Ayodhya Gangrape

Ayodhya Gangrape

Ayodhya gangrape: అయోధ్య గ్యాంగ్‌‌రేప్ ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో 12 ఏళ్ల చిన్నారిపై రెండు నెలల పాలు అత్యాచారం జరిగినట్లు తెలిసింది. లైంగిక వేధింపుల కారణంగా మైనర్ గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కార్యకర్త మోయిద్ ఖాన్‌తో పాటు రాజు ఖాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో నిందితులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘‘అకృత్యాల విషయంలో, కేవలం ఆరోపణలు చేయడం మరియు రాజకీయాలు చేయడం ద్వారా కాకుండా, నిందితులకు DNA పరీక్షలు చేయడం ద్వారా న్యాయానికి మార్గం కనుగొనాలి’’ అని అన్నారు. దోషులు ఎవరైనప్పటికీ చట్టప్రకారం శిక్షించాలి. అయితే డీఎన్ఏ పరీక్షలో ఆరోపణలు నిజం కాదని తెలిస్తే, సంబంధిత ప్రభుత్వ అధికారులను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read Also: Joe Biden: నన్ను మోసం చేయడం ఆపండి.. ఇజ్రాయెల్ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..

డీఎన్ఏ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖిలేష్ యాదవ్ నిందితులని సమర్థిస్తున్నాడని, ఇది రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌ల మనస్తత్వమని విమర్శించింది. ఈ ఘటనపై ప్రతిపక్ష ఇండియా కూటమి మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించింది. ‘‘మొయీద్‌ఖాన్‌ ముస్లిం కావడం, బాధితురాలు నిషాద్‌ సామాజికవర్గానికి చెందిన మైనర్‌ బాలిక కావడం వల్లే రేపిస్టులను రక్షించాలని ఇంత ఆరాటమా? ఓట్ల కోసమే పీడీఏ గురించి మాట్లాడుతున్నారా? ఇదీ ముస్లిం బుజ్జగింపుల ఎత్తు. వెనుకబడిన వర్గాలను ఎస్పీ ఎప్పుడూ దోపిడీ చేస్తోంది. కానీ ఈసారి అన్యాయం జరగబోదు’’ అని బీజేపీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

యూపీ డిప్యూటీ సీఎం కేశమ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ బంటు అని విమర్శించారు. మీరు వెనకడినవారు, దళితుల గురించి మరిచిపోయారు, మీకు ఓటు బ్యాంక్ రాజకీయాలే కావాలని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ చీఫ్ మాయావతి మాట్లాడుతూ.. మీరు ఎంత మంది నిందితులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాని అఖిలేష్‌ని ప్రశ్నించారు.అయోధ్య సామూహిక అత్యాచార కేసులో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్ని ఆమె సమర్థించారు. అఖిలేష్ ప్రకటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిష్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో ఫైర్ అయ్యారు. బాలికపై అత్యాచారం జరిగితే నిందితుల్ని సమర్థిస్తున్నారని ఇదే మీ డీఎన్ఏ అంటూ వ్యాఖ్యానించారు.

Show comments