Site icon NTV Telugu

Ayatollah Ruhollah Khomenei: ఇరాన్ సుప్రీం లీడర్ తాత మన భారతీయుడే..

Iran

Iran

Ayatollah Ruhollah Khomenei: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం ప్రపంచదేశాలను భయపెడుతోంది. అమెరికా జోక్యం ఉండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా..? అనే అనుమానాలు నెలకున్నాయి. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్, ఇజ్రాయిల్‌కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాము ఎవరికీ లొంగేది లేదని, యుద్ధం మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఇరాన్ సుప్రీం లీడర్స్ తాతలు మన భారతీయులే అని చాలా మందికి తెలియదు. 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన ఆయతుల్లా రుహెల్లా ముసావీ ఖొమేనీ ఇరాన్‌కి తొలి సుప్రీం లీడర్‌గా పనిచేశారు. రుహెల్లా ఖమేనీ తాత సయ్యద్ ముసావి 19వ శతాబ్ధం ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ బారాబంకీ సమీపంలోని కింతూర్ గ్రామంలో జన్మించారు.

Read Also: Karnataka: హౌసింగ్ పథకంలో ముస్లింలకు 15 శాతం కోటా.. కాంగ్రెస్ సర్కార్ ఆమోదం..

కింతూర్ షియా పండితులకు కీలకంగా ఉన్న ప్రాంతం. అయితే, వీరు 1834లో భారత్ నుంచి ఇరాన్ లోని నజాఫ్‌కి వెళ్లారు. ఆ తర్వాత ఖొమెయిన్ నగరంలో స్థిరపడ్డారు. ఇక్కడ నుంచి ఆయన కుటుంబం మతపరమైన, రాజకీయ అధికారం కోసం పోరాటం ప్రారంభించింది. ఇరాన్ రాజకీయాలను మార్చిన ఖొమేనీకి ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగేందుకు ఆయన కారణం ఆయన తాత ముసావి అని నమ్ముతారు.

1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి ఆయతుల్లా రుహెల్లా ఖమేనీ నాయకుడుగా ఎదిగారు. 1979లో వెస్ట్రన్ దేశాల మద్దతు కలిగిన ఇరాన్ రాజు మొహమ్మద్ రెజా పహ్లవిని గద్దె దించి ఇరాన్‌లో మత ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇరాన్ తొలి సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1989లో ఆయన మరణించారు. ఈయన వారసుడిగా ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఉన్నారు

Exit mobile version