Chennai: ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం షరా మామూలుగా మారుతోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా.. కొంత మంది తమ తీరును మార్చుకోవడం లేదు. దీని వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా టెక్నాలజీ వైపు పయణిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఆటోమెటిక్ ఫైన్ సిస్టమ్ తీసుకువచ్చారు. దీంతో వేగానికి కళ్లెం వేయాలని అధికారులు భావిస్తున్నారు.
Read Also: Honduras: జైలులో నరమేధం.. గ్యాంగ్ వార్‌లో 46 మంది మహిళా ఖైదీల దారుణహత్య
గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు 30 స్పీడ్ రాడార్ గన్స్ ను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా అధిక స్పీడ్ తో ఉన్న వాహనాలకు ఆలోమెటిక్ గా ఫైన్ విధించే వెసులుబాటు కలిగింది. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వెంటనే ఫైన్ పడిపోద్ది. రాడార్ గన్స్ ఆటోమెటిక్ గా చలాన్ విధిస్తాయని పోలీస్ కమిషనర్ జంకర్ జైవాల్ అన్నారు.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గంటకు 40 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాని, దీన్ని మించితే ఫైన్ పడుతుందని అధికారులు తెలిపారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉందని చెన్నై పోలీసులు తెలిపారు. నగరంలో తొలిసారిగా ఈ వ్యవస్థను తీసుకువచ్చినట్లు జైవాల్ తెలిపారు.
