NTV Telugu Site icon

Maharashtra: ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో శిల్పిపై హత్యాయత్నం కేసు

Maharashtra

Maharashtra

మహారాష్ట్రలోని రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 8 నెలల క్రితం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విగ్రహం కూలిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ వైఫల్యాలే కారణమంటూ విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఏక్‌నాథ్ షిండే సర్కార్ చర్యలు చేపట్టింది. విగ్రహం శిల్పిపై హత్యాయత్నం కేసు నమోదు చేసింది.

ఇది కూడా చదవండి: Priyanka Chopra: తన కుమార్తె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచిన ప్రియాంక చోప్రా.. ఐడీ ఇదే

బుధవారం లాతూర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. శివాజీ మహారాజ్‌ మనందరి ఆరాధ్య దైవం అని… ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే శిల్పిపై కేసు బుక్ చేశారు.

ఇది కూడా చదవండి: Amaravathi: రాష్ట్రంలోని పత్తినంతా కొనుగోలు చేయాలి.. కేంద్రానికి మంత్రులు లేఖ

2023, డిసెంబరు 4న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. సోమవారం ఈ విగ్రహం కూలిపోవడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. విగ్రహ నిర్మాణంలోనే పెద్ద కుంభకోణం జరిగిందని సంజయ్‌ రౌత్‌ విమర్శించారు.