Site icon NTV Telugu

Atrocity on the Girl: దేశ రాజధానిలో 11 ఏళ్ల బాలికపై దారుణం.. టాయిలెట్​లోకి లాక్కెళ్లి

Atrocity On The Girl

Atrocity On The Girl

Atrocity on the Girl: దేశ రాజధానిలో 11ఏళ్ల బాలికపై దారుణం చోటుచేసుకుంది. ఓ కేంద్రీయ విద్యాలయంలో పొరపాటు వెళుతూ ఇద్దరు సీనియర్లను ఆబాలిక ఢీకొట్టడంతో.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఆఘటనపై టీచర్‌కు ఆబాలిక తెలిపిన సంస్థ నిర్వహకులు ఈఘటనను బయటకు రాకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించడంతో ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

జూలైలో తనపై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక ఆరోపించింది. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. తన తరగతి గదికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు 11, 12వ తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిలను ఢీకొట్టింది. తాను అబ్బాయిలకు క్షమాపణలు చెప్పానని, అయితే వారు తనను దుర్భాషలాడి వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లారని బాలిక తెలిపింది. బాలురు వాష్‌రూమ్‌కి లోపలి నుంచి తాళం వేసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.

బాధితురాలు మాట్లాడుతూ, ఈ సంఘటన గురించి ఉపాధ్యాయుడికి తెలియజేసినప్పుడు, అబ్బాయిలను బహిష్కరించినట్లు చెప్పారని దీనిపై ఎక్కడా మాట్లాడొద్దని టీచర్‌ చెప్పినట్లు తెలిపింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్‌.. పోలీసులకు, ప్రిన్సిపాల్‌కు విడివిడిగా నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్ కాపీని, ఈ కేసులో చేసిన అరెస్టుల వివరాలను అందించాలని కమిషన్ ఢిల్లీ పోలీసులను కోరింది. ఈ విషయాన్ని పోలీసులకు నివేదించనందుకు పాఠశాల ఉపాధ్యాయుడు లేదా ఇతర సిబ్బందిపై తీసుకున్న చర్యల గురించి సమాచారం అందించాలని ఢిల్లీ పోలీసులు, పాఠశాల అధికారులను ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ కోరింది.

తన పాఠశాల ఉపాధ్యాయుడు విషయాన్ని దాచడానికి ప్రయత్నించాడని బాలిక ఆరోపించడంతో.. ఈ విషయం పాఠశాల అధికారులకు ఎప్పుడు తెలిసింది? వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తెలియజేయాలని కమిషన్ పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ కోరింది. ఈ విషయంలో నిర్వహించిన విచారణ నివేదిక కాపీని అందించాలని కూడా ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ పాఠశాలను కోరింది. ,” అని DCW అధికారి తెలిపారు. దేశ రాజధానిలో పిల్లలకు పాఠశాలలు కూడా సురక్షితం కాకపోవడం చాలా దురదృష్టకరం. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. పాఠశాల అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలి’’ అని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ఆదేశించింది.

అయితే.. స్కూల్‌ వర్గాలు మాత్రం.. బాధిత బాలికగానీ.. ఆమె తల్లిదండ్రులు గానీ ఈ విషయాన్ని తమ దృష్టికి తేలేదని.. పేరెంట్‌ మీటింగ్‌లో కూడా ఈ దారుణం గురించి చెప్పలేదని పోలీసులు విచారణకు వచ్చినప్పుడే విషయం తెలిసిందని అంటున్నారు.

Exit mobile version