NTV Telugu Site icon

Atrocious: పోలీస్ ఉద్యోగంలో భార్య బిజీ.. బేజారై హత్యచేసిన భర్త..

Police Dead

Police Dead

Atrocious: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక భార్యకు పోలీసు లైసెన్స్ వచ్చింది. దీంతో ఆమె ఉద్యోగంలో చేరింది. అయితే విధుల్లో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్లి వివిధ ప్రాంతాలకు వెళ్లేది. డ్యూటీలో బిజీగా ఉండేది. దీన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. తనతో ఎక్కువ సమయం గడపడం లేదనే కోపంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.

పాట్నాలోని జెహనాబాద్‌కు చెందిన గజేంద్ర యాదవ్ తన భార్య శోభా కుమారితో కలిసి నివసిస్తున్నాడు. వారిద్దరూ ఆరేళ్ల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కొంతకాలం క్రితం ఓ కూతురు పుట్టింది. గజేంద్ర యాదవ్ స్థానికంగా కోచింగ్ సెంటర్ నడుపుతుండగా.. అతని భార్యకు ఇటీవలే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి బిజీ అయిపోయింది. శోభాకుమారి విధుల్లో భాగంగా ఇంట్లో కంటే బయటే ఎక్కువగా ఉండేది. అయితే ఇది భర్తకు నచ్చలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విసుగు చెందిన గజేంద్ర యాదవ్ తన భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా స్థానిక హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి హోటల్ గదికి రమ్మని చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గజేంద్ర యాదవ్ తన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mohammed Shami: ఆ వికెట్‌తో నాలో మరింత నమ్మకం పెరిగింది: షమీ