Site icon NTV Telugu

Atrocious in Maharashtra: ఏడేళ్ల బాలికపై హత్యాచారం.. 24 గంటల్లో నిందితుడు అరెస్ట్

Atrocious In Maharashtra

Atrocious In Maharashtra

Atrocious in Maharashtra: మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని మావళ్‌ తాలూకాలోని కోఠార్ణే గ్రామంలో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ నిందితుడిని పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసిన నిందితుడు తేజస్‌ దల్వీ(24)ని పుణె జిల్లా పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన తేజస్ దల్వీ తల్లిని సుజాత దల్వీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణమైన ఘటన తర్వాత స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ కోఠార్ణే గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది.

పుణె జిల్లాలోని మావళ్‌ తాలూకాలోని కోఠార్ణే గ్రామానికి ఏడేళ్ల బాలిక ఈ నెల రెండో తేదీ నుంచి కనిపించకుండాపోయింది. గ్రామంలో మొత్తం గాలించినా ఫలితం లేకపోయింది. దీనితో ఆ చిన్నారి తండ్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అంతటా గాలింపులు చేపట్టగా.. చివరకు ఆ గ్రామంలోని పాఠశాల వెనుక నగ్నస్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులకు కనిపించింది. ఈ వార్త వెంటనే గ్రామస్థులకు తెలిసింది. పోలీసులు వెంటనే శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్లు నివేదిక వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

Lightning Strike: వైట్‌హౌస్‌ సమీపంలో పిడుగు.. ముగ్గురు మృతి, అగ్నిప్రమాదంలో మరో 10 మంది

వారి ఆగ్రహాన్ని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి నిందితుడైన తేజస్‌ దల్వీని 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. తేజస్ నేరాన్ని అంగీకరించినట్లు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ శేల్కే వెల్లడించారు. ఆ నిందితుడు ఆ చిన్నారి ఉంటున్న పక్కింట్లోనే నివాసం ఉంటున్నట్లు తెలిసింది. నిందితుడిని ఉరితీయాలంటూ విద్యార్థులు, మహిళా సంఘాలు, స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ కేసు విచారణ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా జరిపించి నిందితున్ని వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version