Delhi CM Atishi: నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న అతిషి.. కేబినెట్ భేటీ..?

  • ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న అతిషీ..
  • సీఎం అతిషీతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించే ఛాన్స్..
  • నేడు ఢిల్లీ కేబినెట్ మంత్రులతో కొత్త సీఎం అతిషీ సమావేశం..
Atishi

Atishi

Delhi CM Atishi: ఈ నెల 21వ తేదీన (శనివారం) ఢిల్లీ రాష్ట్ర ఎనిమిదో ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఈరోజు (సోమవారం) ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో పాటు మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. అయితే, అతీషి.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో తాను నిర్వహించిన 13 మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ఇందులో ప్రధానంగా విద్య, రెవెన్యూ, ఫైనాన్స్, విద్యుత్ తో పాటు PWD మొదలైనవి ఉన్నాయి. ఆమెతో పాటు మంత్రివర్గంలోని ఇతర మంత్రులు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read Also: TPCC Cheif Mahesh Goud : కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటా..

అయితే, అతిషీ మర్లెనా ముఖ్యమంత్రి పదవిలో మరో 5 నెలలే ఉంటారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే, మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆమెకు పరిపాలన చేసేందుకు ఐదు నెలలే ఛాన్స్ ఉంది. ఇంత తక్కువ టైమ్‌లోనే ఆమె ముఖ్యమంత్రిగా తన మార్క్ చూపించాల్సి ఉండనుంది. అదే సమయంలో తన మంత్రిత్వ శాఖలనూ చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మళ్లీ ఆప్ ని అధికారంలోకి తేవాల్సిన బాధ్యత కూడా అతిషీ పైనే ఉంటుంది.