NTV Telugu Site icon

Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు..

Atiq Ahmed

Atiq Ahmed

Atiq Ahmed: ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లో చక్రం తిప్పిన గ్యాంగ్ స్టర్ కమ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్ కు ప్రయాగ్ రాజ్ కోర్టు జీవితఖైదు విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్దోషులుగా గుర్తించింది. హత్య, కిడ్నాప్ తో సహా అతిక్ అహ్మద్ పై 100కు పైగా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.

సోమవారం ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఇతడిని రోడ్డు మార్గం ద్వారా గుజరాత్ నుంచి ప్రయాగ్ రాజ్ తీసుకువచ్చారు. అతడిని తీసుకువచ్చే క్రమంలో యూపీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. యోగీ సర్కార్ ఎన్ కౌంటర్ చేస్తుందనే భయంతో తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని అతిక్ అహ్మద్ కోరారు. 17 ఏళ్ల నాటి కిడ్నాప్ కేసులో నేడు కోర్టు విచారణకు ముందు, అహ్మద్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ సెంట్రల్ జైలుకు తరలించారు.

Read Also: Rahul Gandhi: ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తా.. “హ్యాపీ మెమోరీస్” అంటూ రాహుల్ లేఖ

2005లో మాయావతి పార్టీ బహూజన్ సమాజ్వాదీ పార్టీ( బీఎస్పీ) కి చెందిన ఎమ్మెల్యే రాజుపాల్ ను హత్య చేశారు. ఈ కేసులో ఉమేష్ పాల్ అనే వ్యక్తి కీలక సాక్షిగా ఉన్నాడు. అయితే ఇతడిని 2006లో అతిక్ అహ్మద్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవాలని తుపాకీతో బెదిరించారు. ఇదిలా ఉంటే ఒక నెల క్రితం ఫిబ్రవరిలో ఉమేష్ పాల్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో ఉమేష్ పాల్ తో పాటు ఇద్దరు గన్ మెన్స్ కూడా మరణించారు. ఈ ఘటన వెనక అతిక్ అహ్మద్ హస్తం ఉందని తెలుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఉమేష్ పాల్ హత్యలో పాల్గొన్న ఇద్దరిని యూపీ పోలీసు ఎన్ కౌంటర్ లో లేపేశారు.

ప్రస్తుతం 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది.ఇదిలా ఉంటే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను హత్య చేయడంపై యోగీ ఆదిత్య నాథ్ సీరియస్ అయ్యారు. ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.