Site icon NTV Telugu

Flights Delayed: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్పోర్టులోనూ సాంకేతిక సమస్య.. నిలిచిపోయిన 400 విమానాలు..

Atc

Atc

Flights Delayed: భారతదేశంలో అత్యంత బిజీగా ఉండే ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ఏటీసీ సాంకేతిక సమస్యల కారణంగా గందరగోళం కొనసాగుతుంది. ఉదయం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపంతో గురువారం నుంచి విమానాలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 400కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్ లాంటి ఎయిర్‌లైన్‌లు ప్యాసింజర్లకు ముందస్తుగా అలర్ట్ జారీ చేశాయి. ఎయిర్ పోర్టు అధికారులు మాన్యువల్ ప్రక్రియలతో పని మొదలు పెట్టారు. కానీ సమస్య పూర్తిగా పరిష్కారం మాత్రం కాలేదు. మరోవైపు, ముంబై ఎయిర్ పోర్టులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో అక్కడి విమానాలపై కూడా ప్రభావితం అయ్యాయి.

Read Also: Pakistan: భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాకిస్తాన్..

అయితే, ఎయిర్ పోర్టుల్లో ATC వ్యవస్థలోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టంలో లోపం తలెత్తినట్లు సమాచారం. ఈ వ్యవస్థ విమానాల ప్రణాళికలను ఆటోమేటిక్ గా సిద్ధం చేస్తుంది. ఈ వ్యవస్థలో సమస్యతో కంట్రోలర్లు మాన్యువల్‌గా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, గురువారం 513 విమానాలు, శుక్రవారం ఉదయం నుంచి 171 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఇక, ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ఏటీసీలో లోపంతో వ్యవస్థ మొత్తం గందరగోళానికి గురైంది. కాగా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాన్యువల్ ప్రక్రియలతో పని చేస్తున్నట్లు తెలుస్తుంది. సాంకేతిక టీమ్‌లు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది, కానీ విమానాల ఆలస్యాలు కొనసాగవచ్చని అధికారులు తెలియజేశారు. ఈ సమస్య కారణంగా ప్రయాణికులు బోర్డింగ్ గేట్ల దగ్గర లాంగ్ క్యూలు, టెర్మినల్‌లలో వేచి చూస్తున్నారు. విమానాల్లో కూడా వెయిటింగ్ లిస్టు పెరిగింది. కాగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వీటిలో కొన్ని రద్దయ్యాయి.

Exit mobile version