NTV Telugu Site icon

BJP MLA: పంక్చర్లు వేసుకోండి..విద్యార్థులకు ఎమ్మెల్యే సలహా! మండిపడుతున్న నెటిజన్లు

Mlapannalalshakya

Mlapannalalshakya

మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే.. చదువులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో విద్యార్థులు మోటర్‌ సైకిల్‌ పంక్చర్‌ దుకాణాలు తెరవాలని సలహా ఇచ్చారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి విద్యార్థులకు ఇటువంటి సూచనలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Agriculture: కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామీణ పరిశ్రమల కోసం వ్యవసాయ నిధి ఏర్పాటు!

సోమవారం గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం ఉపయోగం లేదని.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్‌ సైకిల్‌ రిపేర్‌ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకొవాలని సూచించారు. దీంతో విద్యార్థులంతా అవాక్కయ్యారు.

ఇది కూడా చదవండి: Indias trade: విదేశాల్లో భారతీయ వస్తువులకు డిమాండ్..భారీగా పెరిగిన ఎగుమతులు

ఇదిలా ఉంటే ఒక్క రోజులోనే స్థానికంగా 11 లక్షల మొక్కలు నాటి ఇందౌర్‌ గిన్నిస్‌ రికార్డు సృష్టించడాన్ని ప్రస్తావించిన ఆయన.. పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కలు నాటుతున్నారు.. కానీ, ఆ తర్వాత వాటి పరిరక్షణ గురించి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య వాపోయారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ప్రసాద్ ఐమాక్స్ లో 18 రోజులకు 4.8 కోట్లు!!