NTV Telugu Site icon

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో అంతుచిక్కని రోగం.. 8 మంది మృతి..

Rahouri

Rahouri

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని అనారోగ్యం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ గుర్తు తెలియని అనారోగ్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 08కి చేరింది. బుధవారం ఇక్కడ ఆస్పత్రిలో మరో చిన్నారి వ్యాధి కారణంగా మరణించింది. దీంతో ఈ వ్యాధిని గుర్తించేందుకు కేంద్రం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. బాధిత గ్రామంలోని కేసులు, మరణాలను పరిశోధించడానికి, పరీక్షలను వేగవంతం చేయడానికి బయోసేఫ్టీ లెవల్ 3 (BSL-3) మొబైల్ లాబొరేటరీని రాజౌరికి పంపినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Mahesh Kumar Goud: అంబేద్కర్ మాకు దేవుడు లెక్క.. అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలి: పీసీసీ చీఫ్‌

మహ్మద్ రఫీక్ కుమారుడు పన్నెండేళ్ల అష్ఫాక్ అహ్మద్ జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి)లో ఆరు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని అధికారులు తెలిపారు. ముందుగా చికిత్స కోసం చండీగఢ్ ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు చెప్పారు. అప్ఫాక్ తమ్ముళ్లు ఏడేళ్ల ఇష్తియాక్, 5 ఏళ్ల నాజియా కూడా గత గురువారం మరణించారు. అష్ఫాక్ మృతితో కోట్రంక తహసీల్‌లోని బధాల్ గ్రామంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన రెండు కుటుంబాల వారు. డిప్యూటీ కమీషనర్ (డిసి) రాజౌరి, అభిషేక్ శర్మ, బాధాల్ గ్రామంలోని పరిస్థితిని అంచనా వేయడానికి సోమవారం కోట్రంకను సందర్శించారు.

Show comments