Site icon NTV Telugu

Covid-19: 140 రోజుల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదు..

Covid 19

Covid 19

Covid-19: భారతదేశంలో మరోసారి కరోనా పడగవిప్పుతోంది. నెమ్మదిగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం కేసుల సంఖ్య కేవలం వెయ్యికి దిగువన మాత్రమే ఉండేవి. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం గత రెండు రోజుల్లో 1000 పైగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1300 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 140 రోజుల తర్వాత ఇదే అత్యధికం. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,816కి పెరిగింది.

Read Also: Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?

దేశంలో ఇప్పటి వరకు 4.46 కోట్లు (4,46,99, 418) కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 4,41,60,997 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7,605కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 1.46 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.02 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 92.06 కోట్ల పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 89,078 చేశారు. మొత్తం మరణాల శాతం 1.19 శాతంగా ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించారు.

Exit mobile version