Site icon NTV Telugu

వైరల్‌: అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి ఇలా షాకిచ్చింది..

Bhavna Kashyap

Bhavna Kashyap

తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడికి షాక్‌ ఇచ్చింది యువతి.. అతడిని స్కూటీని డ్రైనేజీలోకి తోసేసి.. మరీ బుద్ధిచెప్పింది.. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భావ‌న క‌శ్యప్ అనే యువతి సాయంత్రం టైంలో రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా.. స్కూటీపై వ‌చ్చిన ఓ యువ‌కుడు ఆమె ముందు ఆపి.. ఏదో అడ్రస్‌ అడిగారు.. తనకు తెలియదని ఆ యువతి బదులివ్వగా.. కొంచెం ముందుకెళ్లి.. మళ్లీ వెనక్కి వచ్చిన ఆ పోకిరీ.. మళ్లీ అడ్రస్‌ అడుగుతూ.. అస‌భ్యక‌రంగా ప్రవ‌ర్తించాడు. ఆ యువ‌తి ఛాతీపై చేయి వేసి గట్టిగా నొక్కాడు.. ఊహించని పరిణామంతో షాక్‌ తిన్న యువతి.. మొదట్లో భయపడినా.. వెంటనే తేరుకుని.. ఆ కామాంధుడిని బుద్ధిచెప్పింది.. స్కూటీ ముందుకు వెళ్లకుండా గట్టిగా పట్టుకుని.. తోసివేసింది.. దీంతో.. పక్కనే ఉన్న మురికికాల్వలో పడిపోయింది ఆ స్కూటీ..

అత‌న్ని వ‌దిలేస్తే ఇలానే మ‌రికొంత మందిని వేధించే అవ‌కాశం ఉంది.. అందుకే తనకు బుద్ధి చేప్పాలని అనుకున్నట్టు తర్వాత తెలిపింది భావన కశ్యప్.. ఇక, ఈ ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. ఆ యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. తక్షణమే స్పందించిన పోలీసులను భావన కృతజ్ఞతలు తెలిపింది.. మరోవైపు.. భావన కశ్యప్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.. ఆమె వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తూ.. ఆమె ధైర్యాన్ని మొచ్చుకుంటున్నారు.. మొత్తంగా ఈ వ్యవహారం నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది.

Exit mobile version