Site icon NTV Telugu

Assam tension: హనుమాన్ ఆలయంలో ఆవు మాంసం..‘‘షూట్-అట్-సైట్’’ ఆర్డర్స్ ఇచ్చిన సీఎం..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Assam tension: ఈద్ రోజున కొందరు దుండగులు హిందువులు ఆలయాలు, ప్రాంతాలను అపవిత్రం చేయడం అస్సాంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఆవు మాంసాన్ని ఆలయాలపైకి విసిరేయడం చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసే వారిని ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నేరస్తులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ.. ‘‘షూట్-అట్-సైట్’’ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని ధుబ్రీ ప్రాంతంలో ఒక మతపరమైన గుంపు ఉద్దేశపూర్వకంగా ఆలయాలపై దాడులకు తెగబడ్డాయి. ధుబ్రీలో పర్యటించిన సీఎం హిమంత మాట్లాడుతూ.. పవిత్ర స్థలాలను అపవిత్రం చేసే శక్తుల పట్ల ‘‘జీరో టాలరెన్స్’’ పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనల వెనక ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. హనుమాన్ ఆలయంలో ఆవు తలతో పాటు మాంసం ఆవశేషాలు కనిపించిన తర్వాత ఈ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు నెలకున్నాయి.

Read Also: Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

ధుబ్రీ పట్టణంలో అధికారికంగా కానిపిస్తే కాల్చివేత ఆదేశాలు విధించబడినట్లు, రాత్రి నుంచి అమలులోకి వస్తాయని సీఎం చెప్పారు. రాళ్లు రువ్వడం లేదా ప్రజా ఆస్తులపై దాడులు వంటి హింస లేదా చట్టవిరుద్ధమైన చర్యలకు అధికారులు వెంటనే స్పందిస్తారని ఆయన హెచ్చరించారు. అస్సాంలో అశాంతిని రెచ్చగొట్టడానికి బంగ్లాదేశ్ నుంచి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని హిమంత విమర్శించారు.

తన ఎక్స్ అకౌంట్‌లో ‘‘ “బక్రీ ఈద్ సందర్భంగా ధుబ్రీలో ఏమి జరిగింది,ఈ పరిస్థితికి మేము ఎలా స్పందిస్తున్నాము?. జిల్లాలో శాంతిభద్రతల అమలు నిర్ధారించడానికి అన్ని మతతత్వ శక్తులను ఓడించడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము’’ అని హిమంత రాశారు. ధుబ్రీలో “కొత్త గొడ్డు మాంసం మాఫియా” ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు, ఇది పెద్ద కుట్రను సూచిస్తుంది. ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచే వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈద్‌కు ముందు ఈ మాఫియా పెద్ద ఎత్తున పశువుల అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Exit mobile version