Assam tension: ఈద్ రోజున కొందరు దుండగులు హిందువులు ఆలయాలు, ప్రాంతాలను అపవిత్రం చేయడం అస్సాంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఆవు మాంసాన్ని ఆలయాలపైకి విసిరేయడం చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసే వారిని ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నేరస్తులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ.. ‘‘షూట్-అట్-సైట్’’ ఆదేశాలు జారీ చేశారు.
భారత్‌లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నిన ఇద్దర ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశిస్తుండగా ఐఎస్ఐఎస్‌కు చెందిన ఇద్దరు ముష్కరులను అదుపులోకి తీసుకున్నారు.