Fourth Assam Madrassa Demolished: అస్సాంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నాయి మదర్సాలు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి.. మదర్సాలే కేంద్రంగా ఉగ్రవాద కర్యకలాపాలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వీరంతా మదర్సాల్లో టీచర్లుగా పనిచేస్తూ.. స్థానికులను ఉగ్రవాద భావజాలం వైపు తీసుకెళ్తున్నారు. దీంతో అస్సాం ప్రభుత్వం వీరిపై ఉక్కుపాదం మోపుతోంది. అల్ ఖైదా ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న అన్సరుల్లా బంగ్లాటీమ్ అస్సాం కేంద్రంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది. హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే అన్సరుల్లా బంగ్లా టీం ఉగ్రవాద సంస్థకు సంబంధించి కార్యకరలాపలకు పాల్పడుతున్న వారిని వరసగా అరెస్ట్ చేస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు అస్సాం పోలీసులు 40 మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదికి అటూఇటూగా ఉన్న జిల్లాల్లో ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
Read Also: OTT: హిందీ మినహా ఆ మూడు భాషల్లో ‘సీతారామం’!
ఇదిలా ఉంటే అస్సాం ప్రభుత్వం మదర్సాల వివరాలను కోరింది. అక్రమంగా నిర్వహిస్తున్న మదర్సాలు కూల్చివేస్తోంది. ఏ మదర్సాలు అయితే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాయో వాటిని ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేస్తున్నాయి. అన్ని మదర్సాల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని ఇప్పటికే సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మదర్సాలను తప్పకుండా కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే అస్సాంలో పలు జిల్లాల్లో మూడు మదర్సాలను కూల్చేశారు. తాజాగా మరో మసీదును స్థానికులే నేలమట్టం చేశారు.
అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో ఓ మసీదులో బంగ్లాదేశీయులు ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. స్థానికులు దానిని కూల్చివేశారు. ఇద్దరు బంగ్లాదేశీయలు అమీనుల్ ఇస్లాం, జహంగీర్ అలోమ్ అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ సభ్యుల అని.. వారు 2020-22 మధ్య మదర్సాలో బోధించారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కూల్చివేతలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేదని పోలీసులు వెల్లడించారు. జీహాదీ కార్యకలాపాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఈ చర్యలకు పాల్పడ్డారు. అస్సాంలో ఉగ్రవాద సంస్థలు స్లీపర్ సెల్స్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎవరైనా రాష్ట్రం వెలుపల నుంచి మదర్సాలో, మసీదుల్లో బోధనలకు వస్తే తప్పుకుండా ప్రభుత్వం పోర్టల్ లో వారి సమాచారం నమోదు చేయాలని అస్సాం ప్రభుత్వం ఆదేశించింది.
