Site icon NTV Telugu

Singer Zubeen Garg: నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టం.. జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం సీఎం హెచ్చరిక

Singer Zubeen Garg

Singer Zubeen Garg

అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి సూచించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. జుబీన్ గార్గ్ మృతికి కారణమైన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. దర్యాప్తు బృందానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు పేర్కొన్నారు. ఒకవేళ సిట్ విఫలమైతే మాత్రం సీబీఐకి అప్పగిస్తామని వెల్లడించారు. జుబీన్ గార్గ్ మరణం అందరి హృదయాలను కలిచి వేస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే డెత్‌ సర్టిఫికెట్‌పై అనుమానాలు ఉన్నాయంటూ గతంలోనే సీఐడీ అప్పగించనున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

సింగపూర్‌లో జరిగే నార్త్‌ ఈస్ట్‌ ఫెస్టివల్‌‌కు జుబీన్ గార్గ్ వెళ్లారు. అయితే సెప్టెంబర్ 19న సముద్రంలో బోటింగ్ చేస్తున్నారు. అనంతరం లైఫ్ జాకెట్ ధరించి ఈత కొట్టేందుకు దూకారు. కానీ కొద్దిసేపటికే ఇబ్బందికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురయ్యారు. కానీ కొద్దిసేపటికే ఆయన మరణించినట్లు వార్త ప్రకటించారు. దీంతో అస్సామీయులు, అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణవార్త తెలియగానే దు:ఖంలో ముగినిపోయారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: India: భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం.. రైలు నుంచి నింగికేగిన అగ్ని ప్రైమ్‌

ఇక ఆయన భౌతికకాయం గౌహతికి చేరుకుంది. అక్కడ నుంచి ఆయన స్వగ్రామం వరకు.. దాదాపు 25 కి.మీ వరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి పూల వర్షం కురిపించారు. అలాగే అంత్యక్రియలకు కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంతగా జుబీన్ గార్గ్‌పై అస్సామీయులు ప్రేమను పెంచుకున్నారు. అయితే ఆయన మరణంపై అనుమానాలు రావడంతో అస్సాం ముఖ్యమంత్రి సిట్ దర్యాప్తునకు ఆదేశించారు.

 

Exit mobile version