NTV Telugu Site icon

Gujarat HC: మహిళ పేరు, నంబర్ అడగడం “లైంగిక వేధింపుల” కిందకు రాదు..

Law News

Law News

Gujarat HC: మహిళ పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ అడగడం సరికాదని, అయితే ఇది లైంగిక వేధింపుల కిందకు రాదని గుజరాత్ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. గాంధీనగర్‌కి చెందిన ఒక మహిళ తన పేరు అడిగినందుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక వ్యక్తిపై IPC సెక్షన్ 354A కింద FIR నమోదు చేసిన తర్వాత ఈ తీర్పు వచ్చింది. రాయ్ అనే వ్యక్తి తనపై నమోదైన కేసుపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పోలీసులు దౌర్జన్యంపై ఆయన ఆరోపించారు.

Read Also: Sai Pallavi: ‘తండేల్’ సెట్స్ లో సాయి పల్లవితో కేక్ కటి చేయించిన టీమ్.. ఎందుకంటే?

పోలీసులు తన మొబైల్ ఫోన్ తీసుకెళ్లి, తన డేటాను తొలగించారని, ఆ తర్వాత పోలీసులపై వివిధ ఫోరమ్‌లలో ఫిర్యాదు చేశానని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు దాఖలు చేసిన అభియోగాలను జస్టిస్ నిర్జార్ దేశాయ్ తిరస్కరించారు. లైంగిక వేధింపుల కింద పోలీసులు దాఖలు చేసిన కేసును ప్రశ్నించారు. ‘‘ఎవరైనా మీ నంబర్ ఎంత’’ అని అడిగితే నేరం, కానీ అది ఎఫ్ఐఆర్ కోసం మంచి కేసు కాదు, దీంట్లో అతని దురుద్దేశాన్ని మీరు ఎలా చూపిస్తారు..? అని హైకోర్టు పోలీసుల్ని ప్రశ్నించింది.

ఈ కేసులో న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ.. ‘‘ వాస్తవానికి, సదరు వ్యక్తికి అది తగిన చర్య కాదు. ఐపీసీలోని సెక్షన్ 354 ప్రకారం లైంగిక వేధింపులు, శిక్షలకు సంబంధించింది. ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయబడిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒక అపరిచిత మహిళ పేరు, అడ్రస్ ఇతరత్రా అడిగినట్లు చెబుతోంది. తెలియని మహిళ వివరాలు అడగడం అనుచిత చర్యగా చెప్పవచ్చు. కానీ లైంగిక వేధింపులకు సమానం కాదు’’ అని చెప్పింది.