UAPA: “దేశానికి వ్యతిరేకంగా యుద్ధం”.. కాశ్మీర్ వేర్పాటువాది ఆసియా అంద్రబీకి జీవితఖైదు..
- జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రబీకి జీవితఖైదు..
- ఉగ్రవాద కార్యకలాపాలు, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ఆరోపణల్లో దోషిగా నిర్ధారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAPA: కాశ్మీర్ వేర్పాటువాది ఆసియా అంద్రబీకి ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం’ (UAPA) కింద నమోదైన ఒక ఉగ్రవాద సంబంధిత కేసులో ఈమెను దోషిగా తేల్చారు. ఆమె సహచరులైన సోఫీ ఫెహ్మిదా, నహీదా నస్రీన్లకు ఒక్కొక్కరికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. నిషేధిత సంస్థ ‘దుఖ్తరాన్-ఎ-మిల్లత్’ (DeM) సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు గాను, ఈ ముగ్గురిని ఈ ఏడాది జనవరి 14న న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది.
జమ్మూ కాశ్మీర్‌ను భారత్ నుంచి విడగొట్టాలని డిమాండ్ చేస్తూ, ఉగ్రవాద సంస్థను స్థాపించింది. దేశానికి వ్యతిరేకంగా కుట్ర, ఉగ్ర సంస్థలతో సంబంధం ఉందని న్యాయస్థానం అంద్రబీని దోషిగా తేల్చింది. నేరపూరిత కుట్ర, దేశంపై యుద్ధం ప్రకటించిన నేరాల కింద ఆమెను దోషిగా నిర్ధారించారు. ఆంద్రబీకి జీవిత ఖైదు విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) న్యాయస్థానాన్ని కోరింది. వీరు భారతదేశంపై యుద్ధం చేశారని, ఇటువంటి కార్యకలాపాలను నిరోధించడానికి ఒక బలమైన సందేశం పంపడం అత్యవసరమని ఆ సంస్థ వాదించింది.
Also Read
ఎన్ఐఏ ప్రకారం.. నిషేధిత దుఖ్తారాన్ ఎ మిల్లత్ ను ఉపయోగించుకుని జమ్మూకాశ్మీర్‌లో అశాంతి రేకెత్తించాలని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. జమ్మూ కాశ్మీర్‌లో అంద్రాబీపై 33 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అలాగే ఫహమిదా, నస్రీన్లపై పలు కేసులు ఉన్నాయని ఎన్ఐఏ కోర్టుకు వెల్లడించింది.
అసియా ఆంద్రాబీ ఎవరు?
అసియా ‘దుఖ్తరాన్-ఎ-మిల్లత్’ను ఒక సంప్రదాయవాద ఇస్లామిక్ సంస్థగా స్థాపించారు. అయితే దీని ముసుగులో వేర్పాటువాద కార్యకలాపాలకు ఉపయోగించింది. 2018లో కేంద్రం దీనిని ఉగ్రవాదసంస్థగా ప్రకటిస్తూ, నిషేధం విధించింది. 1963లో జన్మించిన అంద్రాబీ శ్రీనగర్‌లోని ఒక కాలేజ్‌లో హోమ్ సైన్స్ నుంచి డిగ్రీ పొందింది. తర్వాత చదువు కోసం డార్జిలింగ్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంది, కానీ దీనికి అనుమతి లభించలేదు. ఆ తర్వాత జమాత్ ఏ ఇస్లామీ మహిళా విభాగంలో చేరింది. ఈ సంస్థను 2019లో నిషేధించారు.
1985లో జమాత్ నుంచి విడిపోయి దుఖ్తరాన్ ఎ మిల్లత్‌ను స్థాపించారు. 1991లో కాశ్మీర్‌లో పర్దా ఆచరణ తప్పనిసరి చేస్తూ ప్రచారం నిర్వహించింది. దీంతో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారారు. 1990లో, ఆమె వేర్పాటువాద నాయకుడు ఆషిక్ హుస్సేన్ ఫక్తూను వివాహం చేసుకున్నారు. కాశ్మీరీ పండిట్ నాయకుడు హెచ్.ఎన్. వాంచూ 1992లో జరిగిన హత్యకు సంబంధించిన కేసులో ప్రస్తుతం ఫక్తూ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంద్రబీ తొలిసారిగా 1993లో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆమెకు జీవితఖైదు పడింది.
తాజావార్తలు
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?