గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్ బంగ్లా దర్బార్ హాల్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేశ్, సంధ్యారాణి, తెలుగుదేశం ఎంపీలు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు, నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Kerala: జైలు నుంచి దివ్యాంగ ఖైదీ ఎలా తప్పించుకోగలిగాడు.. అధికారులు తర్జనభర్జన
ప్రమాణస్వీకారం అనంతరం అశోక్ గజపతిరాజును గోవా అధికారులు పరిచయం చేసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా పరిచయం చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్.. గజపతిరాజుకు బొకే ఇచ్చి.. శాలువా కప్పి సన్మానించారు.
