Site icon NTV Telugu

చావంటే భయం లేదు.. జడ్ కేటగిరీ సెక్యూరిటీ అక్క‌ర‌లేదు..!

ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ వాహ‌నంపై కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి.. హైద‌రాబాద్‌లోనూ ముంద‌స్తుగా భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టారు పోలీసులు.. ఒవైసీ కారుపై కాల్పుల నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భద్రతను స‌మీక్షించిన కేంద్రం.. వెంటనే అమలులోకి వచ్చేలా ఆయ‌న‌కి సీఆర్‌పీఎఫ్ యొక్క జ‌డ్ కేటగిరీ భద్రతను అందిస్తున్న‌ట్టు పేర్కొంది.. అయితే, తనకు చావంటే భయం లేదు.. తనకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ అక్కర్లేద‌ని స్ప‌ష్టం చేశారు అసదుద్దీన్ ఒవైసీ.

Read Also: పైసలు లేకపోతే ఎవ్వ‌డూ దేక‌డు, కాన‌డు.. డ‌బ్బు చాలా ముఖ్యం-టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఎన్నిక‌ల కార్య‌క్ర‌మం ముగించుకుని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీరట్ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా తన కారుపై కాల్పులు జరిగిన ఘటనపై ఇవాళ లోక్‌సభలో మాట్లాడిన హైద‌రాబాద్ ఎంపీ.. త‌న‌కు చావంటే భయం లేదని, త‌న‌కు జ‌డ్ కేట‌గిరీ సెక్యూరిటీ అక్క‌ర‌లేద‌ని.. దానిని తాను తిరస్కరిస్తున్నానని వెల్ల‌డించారు.. తనను ‘ఏ’ కేటగిరీ పౌరుడిగానే ఉంచాలని కోరారు ఒవైసీ.. ఇక‌, యూపీలో జరిగిన ఘటనపై తాను సైలెంట్‌గా ఉండబోనని, తనకు న్యాయం చేయాలని కోరిన ఆయ‌న‌.. కాల్పులు జరిపిన నిందితులపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రయోగించే ఉపా చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.. విద్వేషాన్ని, తీవ్రవాదానికి ముగింపు పలకాలని కేంద్రాన్ని కోరారు..

Exit mobile version