మదర్సాల్లో జాతీయ గీతం, జ్ఞానవాపి మసీదు సర్వే అంశాలపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యాడు. యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మసీదుల్లో జాతీయగీతం జనగణమనను తప్పనిసరి చేసింది. గురువారం నుంచే యూపీలోని అన్ని మసీదుల్లో జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుకూలంగా వారణాసి కోర్ట్ ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ నాకు దేశభక్తి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో సంఘ్ పరివార్ లేదని.. బ్రిటిష్ కు వ్యతిరేఖంగా ఈ మదర్సాలే నిలిచాయని అన్నారు. ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో అన్ని మదర్సాల్లో దేశభక్తి గురించి మాట్లాడుతామని.. మరద్సాలలో దేశం పట్ల ప్రేమ నేర్పుతున్నారని అన్నారు. వాళ్లను అనుమానంగా చూస్తున్నారంటూ.. ఇందుకోసమే అలాంటి చట్టాలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
జ్ఞానవాపి మసీదు సర్వేపై వారణాసి కోర్ట్ తీర్పు 1991 నాటి ప్రార్థన స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే అని… బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. 1947 ఆగస్టు 15 నాటి మతపరమైన స్థలాల స్వభావాన్ని మార్చాలనుకుంటే అది 1991 చట్టం కింద నేరంగా పరిగణించబడుతుందని…యోగీ ప్రభుత్వం అలాంటి వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కోర్ట్ ఇలాంటి వారికి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చని అన్నారు. మేము ఒక బాబ్రీ మసీదును కోల్పోయామని… మరో మసీదును కోల్పోవాలని కోరుకోవడం లేదని అన్నారు. జ్ఞానవాపి వివాదంపై ఆల్ ఇండియా పర్సనల్ లాబోర్డ్, మసీదు కమిటీ సుప్రీంకు వెళ్తాయని వెళ్తాయని ఆశిస్తున్నట్లు అసదుద్దీన్ వెల్లడించారు.