Site icon NTV Telugu

Asaduddin Owaisi: త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును మోదీ ప్రభుత్వం తొలగిస్తుందా..?

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును తొలగిస్తుందా..? అని ప్రశ్నించారు. పచ్చదనంలో ప్రభుత్వానికి ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని అడిగారు. చైనా చొరబాటుపై ప్రధాని మోదీ మాట్లాడరా..? బిల్కిస్ బానోకు న్యాయం చేస్తారా.? అని ప్రశ్నించారు.

Read Also: Smriti Irani Daughter: స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. ముస్తాబైన రాజకోట

2023 కేంద్ర బడ్జెట్లో మైనారిటీ పథకాలకు నిధులను తగ్గించినందుకు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 38 శాతం తగ్గించబడ్డాయని అన్నారు. దేశంలోని ముస్లింలు చదువుకోవడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు. పస్మాండ ముస్లింలపై మీకు అంత ప్రేమ ఉంటే దళిత ముస్లిం హోదా ఇవ్వాటని.. బీహార్ ముస్లింలకు ఓబీసీ హోదా కావాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, బీజేపీలు ఓలిగార్చ్ లకు జన్మనిచ్చాయని.. దేశ సంపదతో పలువురు పారిపోతున్నారని.. పారిపోయిన వ్యక్తుల జాబితాలో మొఘల్ ల పేరు ఉందా..? దీనిపై మీరు ఏం మాట్లాడరు అని అన్నారు. హిండెన్‌బర్గ్ భారతదేశంలో ఉంటే, అది చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టాన్ని ఎదుర్కొనేది అని అన్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ఇటీవల ఓ నివేదికను ఇచ్చాయి. దీంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు పడిపోయాయి. ఓవైసీ మాట్లాడుతూ.. ప్రార్థనా స్థలాల చట్టానికి భంగం కలిగించవద్దని అభ్యర్థించారు. ప్రధాని చైనాకు భయపడవద్దని, మైనారిటీ బడ్జెట్ పెంచాలని సూచించారు.

Exit mobile version