Site icon NTV Telugu

UP Result 2022: ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఒవైసీ..

Asaduddin Owaisi

తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీకే పరిమితం అయిన ఎంఐఎం పార్టీ.. ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరణపై గురిపెట్టింది.. అందులో భాగంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పోటీ చేస్తూ వస్తోంది.. ఇక, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు ఆ పార్టీ అభ్యర్థులు.. వారి తరపున ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో.. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు కూడా కలకలం సృష్టించాయి.. కానీ, యూపీలో ఎంఐఎం మాత్రం పెద్దగా ప్రభావం చూపినట్టు కనిపించడం లేదు.. మరోసారి బీజేపీ యూపీ పీఠాన్ని ఎక్కబోతోంది..

Read Also: Punjab: దిగ్గజాలను ఊడ్చేసిన ‘చీపురు’

ఇక, ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించారు అసదుద్దీన్ ఒవైసీ.. రాజేంద్రనగర్ శాస్త్రిపురంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఉత్తరప్రదేశ్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఇచ్చిన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం అన్నారు.. ఎక్కడ ఏం జరిగింది ఎలాంటి లోటు పాట్లు జరిగాయి ఓటములకు గల కారణాలపై అంచనా వేస్తున్నామన్న ఆయన.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ శాతం అధికారికంగా వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో స్పందిస్తానని తెలిపారు.. కాగా, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థులకు కేవలం 0.43 శాతం ఓట్లు మాత్రమే సాధించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Exit mobile version