NTV Telugu Site icon

Arvind Kejriwal: ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలి.. ఢిల్లీ విజయం తర్వాత కేజ్రీవాల్..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal’s reaction to Delhi’s victory: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గండికొట్టింది. ఢిల్లీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 250 స్థానాల్లో ఆప్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తంగా 134 స్థానాలను, బీజేపీ 104 స్థానాలను, కాంగ్రెస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ విజయంపై ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబంరాలు చేసుకుంటున్నారు.

Read Also: Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ను ఖతం చేసేందుకు.. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పన్నాగం

ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయంపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ విజయాన్ని కట్టబెట్టినందుకు ఢిల్లీ ప్రజలు అభినందిస్తున్నానని.. మార్పు తీసుకువచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర ముఖ్యనాయకులతో కలిసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేయడానికి బీజేపీ, కాంగ్రెస్ సహకారాన్ని కోరుకుంటున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీని అభివృద్ధి చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు కోరుతున్నానని ఆయన అన్నారు. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్ధాలని ఆయన అన్నారు. ఈ రోజు ఢిల్లీ ప్రజలు యావత్ దేశానికి సందేశం ఇచ్చారని కేజ్రీవాల్ అన్నారు.

ఆప్ కి విజయాన్ని ఇచ్చినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారని మనీష్ సిసోడియా అన్నారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదని.. ఇది బాధ్యత అని అన్నారు. చిన్న పార్టీ ఆప్, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ పార్టీని ఓడించిందని ఆప్ నేత రాఘవ్ చద్ధా అన్నారు.