Site icon NTV Telugu

Arvind Kejriwal: ప్రధాని మోడీ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తారా..?

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీపై విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలైన తర్వాతి రోజు తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ…‘‘ ఇండియా కూటమి పార్టీలను ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీ అడుగుతూనే ఉంది, నేను వారి ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని కాషాయ పార్టీని అడుగుతున్నాను..?’’ అని అన్నారు. 2025లో ప్రధాని మోడీ పదవీ విరమణ చేస్తారా..? ఆ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Read Also: Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే సీఎం యోగిని మారుస్తారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..

సెప్టెంబర్ 17న ప్రధాని మోడీ తన 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు, 75 ఏళ్ల తర్వాత పార్టీలోని నేతలు రిటైర్ అవుతారని ఆయన నిబంధన పెట్టారు, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సువిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా రిటైర్ అయ్యారు, ఇప్పుడు సెప్టెంబర్ 17న ప్రధాని మోడీ రిటైర్ కాబోతున్నారని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీ సీఎం యోగిని పదవి నుంచి దించుతారని చెప్పారు. ఆ తర్వాత అమిత్ షా దేశానికి ప్రధానిని చేస్తారు, అమిత్ షా కోసం మోడీ ఓట్లు అడుగుతున్నాడు, మోడీ హామీని అమిత్ షా నెరవేరుస్తారా..? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మోడీ కిగ్యారెంటీ ఎవరు ఇస్తారు..? అమిత్ షా మీ వాగ్దానాలు నెరవేరుస్తారా..? అని ప్రశ్నించారు. బీజేపీ ఓటర్లు కూడా మోడీకి ఓటు వేయబోరని, అమిత్ షాకి ఓటు వేయబోతున్నారని అర్థం అని కేజ్రీవాల్ అన్నారు.

Exit mobile version