Site icon NTV Telugu

Bhagwant Mann: అరవింద్ కేజ్రీవాల్‌ని జైలులో టెర్రరిస్టుగా చూస్తున్నారు..

Arvind Kejriwal , Bhagwant Mann

Arvind Kejriwal , Bhagwant Mann

Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఈ రోజు తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ని కలుసుకున్నారు. కేజ్రీవాల్‌ని జైలులో ఉగ్రవాదిలా చూస్తున్నారని అన్నారు. హార్ట్ కోర్ క్రిమినల్‌గా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రిని చూసి భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. తనతో అరగంట సేపు మాట్లాడానని చెప్పారు. కఠిన నేరస్తులకు కూడా అందే సౌకర్యాలు కూడా ఆయనకు అందడం లేదని, ఆయన చేసిన తప్పేంటని మాన్ ప్రశ్నించారు. దేశంలో పెద్ద టెర్రరిస్టును పట్టుకున్నట్లుగా మీరు అతనితో వ్యవహరిస్తు్న్నారని మండిప్డడారు. పారదర్శకతతో కూడిన రాజకీయాలు చేసి, బీజేపీ రాజకీయాలను అంతమొందించే నిజాయితీపరుడు అరవింద్ కేజ్రీవాల్ అని అన్నారు.

Read Also: Bhanu Prakash Reddy: సీఎంకే భద్రత లేకపోతే ఎలా..? అధికారులు నిద్రపోతున్నారా..?

పంజాబ్ పరిస్థితులను గురించి కేజ్రీవాల్ తనను అడిగారని, అందుకు జూన్ 4 ఫలితాల తర్వాత ఆప్ అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుందని మాన్ చెప్పారు. ఆప్ మొత్తం కేజ్రీవాల్‌కి మద్దతుగా ఉందని చెప్పారు. మరోవైపు ఆప్ నేత సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించడానికి కేజ్రీవాల్ వచ్చే వారం నుంచి ఇద్దరు క్యాబినెట్ మంత్రులను పిలుస్తారని చెప్పారు. ‘‘ కేజ్రీవాల్ తన గురించి ఆలోచించడం మానునకోవాలని, ప్రజల బాగోగులు గురించి అడిగారు. ఉచిత కరెంట్ ఇస్తున్నారా..? అని అడిగారు. కరెంట్ కోతల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో ఉన్న ఉచిత మందుల ఇప్పుడు కొనసాగుతుందా..? అని ప్రశ్నించారు’’ అని పాఠక్ చెప్పారు.

ఢిల్లీ ప్రభుత్వం జైలు నుంచే నడుస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని పాఠక్ చెప్పారు. అంతకుముందు రోజు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడగించారు. ఢిల్లీ మద్యం స్కాములో ప్రధాన సూత్రధారుడిగా అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ పేర్కొంది. ఈ స్కాములో వచ్చిన డబ్బు గోవా ఎన్నికల్లో ప్రచారానికి వాడినట్లు ఆరోపించింది. అయితే, ఆప్ ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఆప్‌కి వ్యతిరేకంగా బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించింది.

Exit mobile version