Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈడీ సమన్లను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై అధికారులు సోదాలు జరిపి ఉదయం అరెస్ట్ చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ట్వీ్ట్స్ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆప్ నేతలు చెబుతున్నారు. లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేజ్రీవాల్‌ని ప్రశ్నించేందుకు ఈడీ అనేక సార్లు పిలిచింది.
ఇదిలా ఉంటే ఈ పరిణామాలు ఆప్ నేతల్లో భయాలను పెంచుతున్నాయి. ‘‘ఉదయం అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై ఈడీ దాడి చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసే అవకాశం ఉంది’’ అని పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి గతంలో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పార్టీ నేతలు సౌరభ్ భరద్వాజ్, జాస్మిన్ షా, సందీప్ పాఠక్ కూడా ఇలాంటి పోస్టుల్నే చేశారు.
Read Also: Iran Blasts: ఖాసిం సులేమాని సమాధి వద్ద జంట పేలుళ్లు.. అమెరికా, ఇజ్రాయిల్ పనేనని ఆరోపణ..
ఇప్పటి వరకు మూడు సార్లు కేజ్రీవాల్ ఈడీ సమన్లను పట్టించుకోలేదు, విచారణకు హాజరుకాలేదు. గతంలో నవంబర్2, డిసెంబర్ 21 తేదీల్లో దర్యాప్తును దాటవేయగా.. నిన్న కూడా విచారణకు వెళ్లలేదు. నిబంధనల ప్రకారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఆప్ నేతలు మాత్రం సమన్లు ఇల్లీగల్ అని, రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని కేంద్రంలోని బీజేపీపై ఆప్ నేతలు విమర్శలు చేస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ని తొమ్మిది గంటలు విచారించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ముగ్గురు కీలక ఆప్ నేతలు జైలులో ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మాజీ సత్యేంద్ర జైన్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌ని కూడా అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జైలుకు వెళ్లిన కూడా తమ సీఎం కేజ్రీవాల్ అని ఆప్ చెబుతోంది. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ఖర్చు పెట్టిందని బీజేపీ గతంలో ఆరోపించింది.
News coming in that ED is going to raid @ArvindKejriwal’s residence tmrw morning. Arrest likely.
— Atishi (@AtishiAAP) January 3, 2024