Site icon NTV Telugu

Arvind Kejriwal: మూడోసారి ఈడీ ముందు హాజరుకు సీఎం కేజ్రీవాల్ డుమ్మా..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఇప్పటి వరకు మూడు సార్లు కేజ్రీవాల్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మూడోసారి కూడా సమన్లను దాటవేశాడు. అయితే ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కేవలం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడమే లక్ష్యమని ఆప్ ఆరోపించింది.

Read Also: UPI Payments : యూపీఐ సరికొత్త రికార్డు.. ఒక్క నెలలో రూ.18 లక్షల కోట్ల లావాదేవీలు

నవంబర్ 2, డిసెంబర్ 21న గతంలో రెండు సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ రెండు సందర్భాల్లో విచారణకు హాజరుకాకపోవడంతో మూడో సారి నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ ఈడీకి సహరించేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే అతడిని అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు ఆప్ చెబుతోంది. ‘‘ఎన్నికల ముందు నోటీసులు ఎందుకు పంపారు..? ప్రచారం నుంచి కేజ్రీవాల్‌ని అడ్డుకోవడానికే ఈ నోటీసులు’’ అంటూ ఆయన పార్టీ ఆరోపించింది.

గతంలో ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ని సీబీఐ ఏప్రిల్ నెలలో ప్రశ్నించింది. ఈడీ సమన్లు జారీ చేసినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో ఆప్‌కి చెందిన మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌తో పాట్ ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ విచారణకు పిలిచి అరెస్ట్ చేసింది.

Exit mobile version