Arvind Kejriwal proves majority, wins trust vote in Delhi Assembly: ఆప్, బీజేపీల మధ్య వివాదం చెలరేగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాాల్ తో పాటు మనీష్ సిసోడియా ఆరోపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లను బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారు. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆదరణతోనే కేంద్రప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి ఆప్ నాయకులను టార్గెట్ చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా గురువారం రోజు ఢిల్లీ అసెంబ్లీలో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష నిర్వహించారు. విశ్వాస పరీక్షలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి విశ్వాస పరీక్షలో అనుకూలంగా ఓటు వేశారు. మొత్తం 70 మంది సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను ఈజీగా ఆప్ పార్టీ దాటి మెజారిటీని నిరూపించుకుంది.
Read Also: MP Aravind: బీహార్ వెళ్లి సీఎం కేసీఆర్ తెలంగాణ పరువు తీశారు.
తమ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ప్రతిపక్ష బీజేపీ ‘ ఆపరేషన్ కమలం’ విఫలమైందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. విశ్వాస తీర్మాణాన్ని ఆగస్టు 29న ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. గురువారం ఓటింగ్ జరిగింది. బీజేపీ ఆపరేషన్ కమలం ‘ ఆపరేషన్ కిచడ్’గా మారిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఆప్ పార్టీకి మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరు విదేశాల్లో ఉండగా.. మరోకరు జైలు, ఇంకొకరు స్పీకర్ గా ఉన్నారు. మిగతా 58 మంది కేజ్రీవాల్ కు మద్దతు ప్రకటించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో డిప్యూటీ సీెం మనీస్ సిసోడియాకు కేజ్రీవాల్ మద్దతుగా నిలిచారు. సీబీఐ దాడుల్లో సిసోడియా ఇంట్లో ఏం కనుక్కొలేదని.. ఆయన డబ్బు లేదని వాడని ఢిల్లీ సీఎం వ్యాఖ్యానించారు. 16 ఏళ్ల బాలికపై తుపాకితో కాల్పులు జరిపిన సంగమ్ విహార్ కేసులో తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, హోం మంత్రిని కోరారు సీఎం కేజ్రీవాల్.