NTV Telugu Site icon

Kejriwal: లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..!

Kejriwal

Kejriwal

లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కస్టడీని ట్రయల్ కోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కస్టడీ బుధవారంతో ముగియడంతో మరోసారి కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్‌ జడ్జి కావేరీ బవేజా ముందు హాజరు పరిచారు. ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించాయి. జైలు నుంచి విడుదలయ్యారు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: యూపీలో 513 మదర్సాల గుర్తింపు రద్దు..

లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోయారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ప్రతి కుటుంబానికి రూ.10 వేలు, హెక్టార్‌కు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన

ఇదిలా ఉంటే వచ్చే నెలలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కేజ్రీవాల్ బెయిల్‌పై ఆప్ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందేమోనని నమ్మకం పెట్టుకున్నారు. త్వరలోనే న్యాయస్థానం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనుంది.

ఇది కూడా చదవండి: Bandi Sanjay : అంకుశం సినిమాలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేది

Show comments