Site icon NTV Telugu

Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ మామిడి పండ్లు, ఆలూ పూరీ తింటున్నాడు.. కోర్టులో ఈడీ వాదనలు..

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. షుగర్ వ్యాధి ఉన్న కేజ్రీవల్ జైలులో మామిడి పండ్లు, ఆలూ పూరీ, స్వీట్లను తింటున్నారని ఈడీ గురువారం కోర్టుకు తెలిపింది. షుగర్ లెవల్స్ పెంచుకోవడం ద్వారా మెడికల్ బెయిల్ పొందాలని చూస్తున్నారంటూ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ డాక్టర్‌ని సంప్రదించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ని విచారిస్తున్న సమయంలో ఈడీ ఈ వాదనలు వినిపించింది.

Read Also: Video Viral: బికినీ ధరించి బస్సులోకి ప్రవేశించిన మహిళ.. చివరకు..

అరవింద్ కేజ్రీవాల్ తీసుకుంటున్న డైట్ నివేదికను సమర్పించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఆప్ అధినేతకు సూచించిన డైట్ వివరాలను సమర్పించాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదిని కోర్టు కోరింది. విచారణ సందర్భంగా ఇంట్లో వండిన భోజనం చేయడానికి కేజ్రీవాల్‌కి అనుమతి ఉంది. అయితే, వైద్యపరమైన కారణాలతో బెయిల్ కోసం అధిక చక్కెర ఉన్న ఆహార పదార్థాలనున తీసుకుంటున్నట్లు ఈడీ పేర్కొంది. ‘‘ అతను ఏమి తింటున్నాడో చూడండి.. ఆలూ పూరీ, మామిడి.. బహుశా అతడికి నియంత్రణ ఉండకపోచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తి ఇవన్నీ తినడం నేను వినలేదు’’ అని ఈడీ తరుపు న్యాయవాది చెప్పారు.

Exit mobile version