NTV Telugu Site icon

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సీబీఐ..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన తరుణంలో, కేజ్రీవాల్ న్యాయవాదులు దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనుకుంటున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్‌ని కోర్టులో విచారించి, ఆయనను అరెస్ట్ చేసేందుకు కావాల్సిన పత్రాలను రౌస్ ఎవెన్యూ కోర్టుకు సీబీఐకి అనుమతి ఇవ్వడంతో అరెస్ట్ జరిగింది.

Read Also: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సీబీఐ..

లిక్కర్ పాలసీ కేసులో కీలక సూత్రధారిగా పేర్కొంటూ మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇటీవల లిక్కర్ కేసును విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే విధించింది. ఈ స్టేపై ఈ రోజు కేజ్రీవాల్ తరుపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈలోపే సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది.