NTV Telugu Site icon

Arvind Kejriwal: వీధి వ్యాపారులపై సర్వే.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు వీధి వ్యాపారుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నగరంలోని ‘‘రేహ్రీ-పాత్రి’’(వీధి వ్యాపారుల) సర్వేని ప్రకటించారు. వీరికి తమ దుకాణాలను నిర్వహించడానికి స్థలాన్ని అందించేందుకు ఈ సర్వే ఉద్దేశించబడింది. ఈ సర్వే కొన్ని నెలల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత వారికి సరైన పద్ధతిలో స్థలాన్ని అందిస్తామని, తద్వారా ఇతర దుకాణదారులకు, ట్రాఫిక్‌కి సమస్య ఉందని ఆయన ఓ వీడియో సందేశంలో చెప్పారు.

Read Also: Arunacha Assembly Polls: అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు

పోలీసులు, ఇతర అధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఎదుర్కోకుండా వీధి వ్యాపారులు గౌరవప్రదంగా జీవనోపాధి పొందేలా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్న కొన్ని గంటల ముందు ఆయన ఈ సర్వేని ప్రకటించారు. ఈసారి ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను ఆప్ గెలవాలని అనుకుంటోంది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలిసి ఢిల్లీలో పోటీ చేస్తుంది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎంపీ స్థానాల ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని రికార్డు ఉంది. వరసగా రెండు పర్యాయాలు ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.