Site icon NTV Telugu

Arunachal CM: చైనాకు షాక్ ఇచ్చిన అరుణాచల్ సీఎం.. ఏమన్నారంటే..

Pema Kandu

Pema Kandu

Arunachal CM: అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాకు మింగుడు పడలేని వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వచ్చాయి. అరుణాచల్‌కు చైనాతో సరిహద్దు లేదని, కేవలం టిబెట్‌తో మాత్రమే సరిహద్దు ఉందని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణాచల్ ప్రదేశ్ చైనాతో 1200 కి.మీ సరిహద్దు పంచుకుంటుందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అనగా, దీనికి పెమా ఖండు స్పందిస్తూ.. ‘‘నేను ఈ విషయంలో మిమ్మల్ని కరెక్ట్ చేయాలి, మేము చైనాతో కాదు టిబెట్‌తో సరిహద్దు పంచుకుంటున్నాము’’ అని అన్నారు.

Read Also: Sigachi Accident: సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన.. ఆ 8 మంది ఆచూకీపై అధికారులు కీలక నిర్ణయం..!

దేశంలో ఏ రాష్ట్రం కూడా చైనాతో సరిహద్దు పంచుకోవడం లేదని ఆయన అన్నారు. 1950లో చైనా బలవతంగా టిబెట్‌ని ఆక్రమించుకుందని ఆయన చెప్పారు. ‘‘అధికారికంగా టిబెట్ ఇప్పుడు చైనా కింద ఉంది. దానిని తోసిపుచ్చలేము. కానీ మొదట మేము టిబెట్‌తో సరిహద్దు పంచుకున్నాము. అరుణాచల్ ప్రదేశ్ మూడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటుంది. భూటాన్, తూర్పున మయన్మార్, టిబెట్’’ అని పెమా ఖండు అన్నారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలను తరుచుగా చైనా తమవి అని వాదిస్తుంది, చైనా ధోరణికి అడ్డుకట్టవేశారు.

చైనా అరుణాచల్ ప్రదేశ్‌ని టిబెట్‌లో భాగంగా చూస్తోంది. పలు సందర్భాల్లో అరుణాచల్ మాదే అంటూ ప్రకటించింది. తన మ్యాపుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని చేర్చింది. చైనా ఈ రాష్ట్రాన్ని ‘‘జాంగ్నాన్’’ లేదా ‘‘దక్షిణ టిబెట్’’గా వ్యవహరిస్తోంది. అయితే, చైనా ప్రయత్నాలను భారత్ పలు సందర్భాల్లో తిప్పికొట్టింది. మ్యాపుల్లో చూపినంత మాత్రాన వాస్తవం మారదు అని చివాట్లు పెట్టింది. అరుణాచల్ భారత్‌‌లో విడదీయలేని అంతర్భాగంగా పేర్కొంది.

Exit mobile version