NTV Telugu Site icon

Delhi Liquor Scam : కవిత విచారణకు ముందు ట్విస్ట్.. వాంగ్మూలం వెనక్కి తీసుకుంటానన్న పిళ్లై​

Arun Pillai

Arun Pillai

Arun pillai takes back his statement over liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో ఇటీవలే అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై తన వాగ్మూలాన్ని ఉప సంహరించుకోవటానికి సిద్దమైయ్యాడు. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు వేశారు అరుణ్‌ రామచంద్ర పిళ్లై. దీంతో ఈడీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కానున్నారు. సరిగ్గా 24 గంటల ముందు.. పిళ్లై పిటీషన్ దాఖలు చేయటం ఆసక్తిగా మారింది.

Komatireddys V/s KTR: అది నిరూపించే దమ్ము నీకుందా? కేటీఆర్‌కు రాజగోపాల్‌ రెడ్డి సవాల్‌

ఇదిలా ఉంటే.. లిక్కర్‌ స్కాంలో ప్రముఖ పాత్ర పోషించారంటూ పిళ్లైను ఈడీ అరెస్ట్‌ చేసి ప్రశ్నించింది. ఈ క్రమంలో.. పిళ్లై , బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాను బినామీ అని, ఆమె ప్రయోజనాల కోసమే పని చేశానంటూ పిళ్లై వాంగ్మూలం ఇచ్చాడంటూ ఆయన రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది.

Dangerous Virus: భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా పంజా.. H3N2 వైరస్‌తో ఇద్దరు మృతి