NTV Telugu Site icon

Article 370: ఆర్టికల్ 370 చరిత్ర, ఎప్పటికీ తిరిగి రాదు: అమిత్ షా..

Amit Shah

Amit Shah

Article 370: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోని విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆయన తోసిపుచ్చారు. ఆర్టికల్ 370 చరిత్ర అయిందని, తిరిగి రాదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీలు తమ మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 పునరుద్ధరణ హామీలు ఇచ్చిన నేపథ్యంతో అమిత్ షా నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది.

Read Also: Ujjain Rape Case: ఉజ్జయిని అత్యాచార ఘటన.. వీడియో తీసిన వ్యక్తులపై కఠిన చర్యలు..!

రెండు రోజుల పర్యటన కోసం ఆయన జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీజేపీకి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమైందని అన్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని భారత్‌తో కలపాలని అనుకుందని ఆయన అన్నారు. ‘‘2014 వరకు జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్రవాదుల నీడలో ఉండేది. వివిధ రాష్ట్ర, జాతీయ నాయకులు దానిని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వాలు బుజ్జగించే విధానాలను అవలంభించాయి. కానీ, 2014-2024 మధ్య జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి సువర్ణాక్షరాలతో లిఖించబడింది’’ అని ఆయన అన్నారు.

ఆర్టికల్ 370 నీడలో వేర్పాటువాదులు, హురియత్ వంటి సంస్థల డిమాండ్లకు ప్రభుత్వాలు తల వంచడం చూశాం. ఆగస్టు 5, 2019న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఆర్టికల్ 370, 35-ఏ అంశాలు రద్దు తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి వేగం పెరిగిందని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని అమిత్ షా దుయ్యబట్టారు. ‘‘నేను దేశానికి స్పష్టం చేయాలనుకుంటున్నాను: ఆర్టికల్ 370 చరిత్రగా మారింది, ఇది ఎప్పటికీ తిరిగి రాదు మరియు దానిని తిరిగి రావడానికి మేము ఎప్పటికీ అనుమతించము. ఎందుకంటే ఆర్టికల్ 370 కాశ్మీర్‌లో యువతకు తుపాకులు మరియు రాళ్లను అప్పగించడానికి దారితీసింది.’’ అని అన్నారు.

Show comments