NTV Telugu Site icon

Baba Ramdev: బాబా రామ్‌దేవ్, బాలకృష్ణకు కేరళ కోర్టు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ

Baba Ramdev

Baba Ramdev

పతంజలి ఆయుర్వేద వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్‌, సంస్థ ఎండీ బాలకృష్ణకు కేరళ కోర్టు షాకిచ్చింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు బెయిలబుల్‌ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్టు చేయాలని ఆదేశించింది. పలు వ్యాధుల నివారణకు దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇచ్చిందని కేరళలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి బాబా రామ్ దేవ్, బాలకృష్ణ కోర్టు ముందు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే పాలక్కడ్ జిల్లా కోర్టు వాళ్లిదరిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Minister Nimmala Ramanaidu: 20 లక్షల ఉద్యోగాలు అందించేందుకు సంకల్పించాం..

బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ.. పతంజలి ఆయుర్వేద్ ఉత్పత్తులు మధుమేహం, కోవిడ్-19 వంటి రోగాలు నయం చేయగలవని తప్పుదారి పట్టించే ప్రకటనలతో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేరళకు చెందిన కేవీ బాబు అనే వైద్యుడు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అనంతరం కేరళలో పది కేసులు, ఉత్తరాఖండ్‌లో ఒక కేసు నమోదైంది. కేవీ బాబు దాఖలు చేసిన ఫిర్యాదులపై కేరళ ఔషద నియంత్రణ విభాగం చర్యలు మొదలుపెట్టింది. అయితే ఈ కేసులో జనవరి 16న కోర్టుకు హాజరుకాకపోవడంతో పాలక్కాడ్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ II బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

ఇది కూడా చదవండి: AP Crime: హత్య కేసులో విస్తుపోయే విషయాలు.. బాత్‌ రూమ్‌లో మహిళ శవం.. బెడ్‌ రూమ్‌లో ప్రియురాలితో రొమాన్స్‌..!