NTV Telugu Site icon

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు సిద్ధమైన ప్రయాగ్‌రాజ్‌..

Maha Kumbamela

Maha Kumbamela

Maha Kumbh Mela 2025: వచ్చే నెల 13 నుంచి 45 రోజుల పాటు కొనసాగనున్న మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ రెడీ అయింది. భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తోంది. ఇక, కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నామని ఆ రాష్ట్ర మంత్రి సురేశ్‌ ఖన్నా చెప్పుకొచ్చారు. అలాగే, భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లతో పాటు 1.5 లక్షల మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Read Also: The KING is dead: ది కింగ్ ఈజ్ డెడ్.. కోహ్లీపై ఆర్సీబీ మాజీ కోచ్ విమర్శలు..

అయితే, కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో ఓ తాత్కాలిక హస్పటల్ ని కూడా ఏర్పాటు చేసేశారు. ఇక, కుంభమేళాకు ముందే ఈ ఆస్పత్రిలో డాక్టర్లు తొలి ప్రసవం చేశారు. గంగా నది ఒడ్డున డేరా పట్టణంలో జీవనం కొనసాగించే సోనమ్‌ అనే మహిళకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రయాగ్‌రాజ్‌లోని తాత్కాలిక దావాఖానాలో జాయిన్ చేశారు. అనంతరం ఆమెకు మగ బిడ్డ పుట్టాడని డాక్టర్లు చెప్పారు. కుంభమేళా జరిగే చోట పుట్టినందున చిన్నారికి ‘మహాకుంభ్‌’గా పేరు పెట్టారని చెప్పుకొచ్చారు.

Show comments