Site icon NTV Telugu

ఏళ్లు గడిచే కొద్ది ఎన్‌డీఏ అభివృద్ధి చెందుతుంది: ఎంఎం నరవణే

ఏళ్లు గడిచే కొద్ది ఎన్‌డీఏ( నేషనల్‌ ఢిపెన్స్‌ అకాడమీ) అభివృద్ధి చెందుతుందని ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఎన్‌డీఏ 141వ కోర్సు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్‌డీఏలో మహిళల ప్రవేశంతో వారికి సాధికారత లభిస్తుందని తెలిపారు.

రానున్న 40 ఏళ్లలో వారు ప్రస్తుతం తానున్న హోదాలో ఉంటారని తెలిపారు. ఏళ్లు గడిచే కొద్ది ఎన్‌డీఏలో కరిక్యూలం మారుతోంది. శిక్షణ పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయన్నారు. కోర్సు కటెంట్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. కొత్త సవాళ్లను ఎదుర్కొ నేందుకు సన్నద్ధమయ్యాం అన్నారు. ఇప్పుడు అకాడమీలో మహిళా కేడెట్‌లను చేర్చుకుంటున్నాం. వారు పురుషుల కన్నా మెరుగైనా ప్రదర్శన కనబర్చుతారని ఆశిస్తున్నట్టు నరవణే పేర్కొన్నారు.

శిక్షణ ప్రమాణాల్లో మార్పు ఉండదు..
వచ్చే 20-30 ఏళ్లలో సాయుధ దళాల్లో మహిళల పాత్ర కీలకంగా మారుతుందన్నారు. మహిళలు ఎన్‌డీఏలో చేరుతున్నందుకు ఏవైనా మార్పులు ఉంటాయ అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు స్వల్పంగా మారతాయన్నారు. కానీ శిక్షణ ప్రమాణాల్లో ఎలాంటి తేడా ఉండబోదని స్పష్టం చేశారు.

ఇప్పటికే చెన్నైలోని ఓటీఓ( ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ)లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం గర్వకారణంగా ఉందని నరవణే వివరించారు. తాను 42 ఏళ్ల కిందట తాను ఓ కేడెట్‌గా ఉన్నప్పుడు ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నారు. కాగా ఈ ఏడాది నవంబర్‌ నుంచి ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షలకు మహిళా అభ్యర్థులకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Exit mobile version