Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. రాజౌరి జిల్లాలోని బాజీ మాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో కెప్టెన్ ర్యాంక్ ఉన్న ఒక ఆర్మీ అధికారితో పాటు ఒక సైనికుడు వీరమరణం పొందారు. మరో ఇద్దరు సైనికులు గాయపడినట్లు సమాచారం.
ఉగ్రవాదులు దాగి ఉన్నారనే ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా ఆర్మీ ప్రత్యేక బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
Read Also: PM Modi: “AI సమాజానికి రక్షణగా ఉండాలి”.. జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ..
జమ్మూ కాశ్మీర్ పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతాలు గత కొన్నేళ్లుగా వరస ఎన్‌కౌంటర్లకు చిరునామాగా మారుతున్నాయి. ఈ ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్నాయి. దీంతో ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు స్థావరాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్ సందర్భంగా భద్రతా బలగాలకు ప్రాణనష్టం జరుగుతోంది.
గత వారం రాజౌరీ జిల్లాలో భద్రతాబలగాలకు, ఆర్మీకి మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. బుధాల్ తహసీల్ పరిధిలోని గుల్లెర్-బెహ్రూట్ ప్రాంతంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ కార్డన్ సెర్చ్ సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.