Site icon NTV Telugu

India Pakistan Tension: ‘‘కమాండర్లకు పూర్తి అధికారాలు’’.. ఆర్మీ చీఫ్ సంచలన ఆదేశాలు..

Indian Army

Indian Army

India Pakistan Tension: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లయితే, ప్రతిఘటన తీవ్రంగా ఉండాలని దీని కోసం కమాండర్లకు ‘‘పూర్తి అధికారం’’ మంజూరు చేస్తూ ఆర్మీ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఈ మేరకు ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారం ఇచ్చారు. పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడితే, దాడులు తీవ్రంగా ఉండాలని పశ్చిమ ప్రాంతంలోని అన్ని ఆర్మీ కమాండర్లకు ఆర్మీ చీఫ్ పూర్తి అధికారాలు కట్టబెట్టారు. శనివారం భారత్, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(DGMO)ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకే భారత్ కాల్పుల విమరణకు అంగీకరించింది.

Read Also: PM Modi: PoK, ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే చర్చలు.. భారత్ సందేశం..

ఈ ఒప్పందానికి కొన్ని గంటల ముందు.. పాకిస్తాన్ భవిష్యత్తులో ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే యుద్ధ చర్యగా భావిస్తామని భారత్ దేశం ప్రకటించింది. ‘‘మే 10-11, 2025 రాత్రి కాల్పుల విరమణ మరియు వైమానిక ఉల్లంఘనల ఫలితంగా, COAS [ఆర్మీ స్టాఫ్ చీఫ్] జనరల్ ఉపేంద్ర ద్వివేది పశ్చిమ సరిహద్దుల ఆర్మీ కమాండర్లతో భద్రతా పరిస్థితిని సమీక్షించారు’’ అని భారత సైన్యం ఎక్స్ పోస్టులో తెలిపింది. మే 10, 2025 నాటి DGMO చర్చల ద్వారా కుదిరిన అవగాహనను ఉల్లంఘించినందుకు కైనెటిక్ ప్రతిఘటన కోసం ఆర్మీ చీఫ్ ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాలు ఇచ్చారు’’ అని సైన్యం తెలిపింది.

‘‘కైనెటిక్ యాక్షన్’’ అంటే సైన్యం కదలికల్ని, ఆయుధాలను కాల్చే చర్యను సూచిస్తుంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని కాల్చి చంపడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తార్, పీఓకేలోని ఉగ్రవాద కార్యాలయాలు,స్థావరాలపై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో భీకర దాడులు చేసింది. పాక్ డ్రోన్లతో దాడులకు తెగబడటంతో, శనివారం తెల్లవారుజామున భారత్ పాకిస్తాన్‌ మిలిటరీకి చెందిన ఆర్మీ, వైమానిక స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పాక్ రాడార్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు, ఎయిర్ బేసులు ధంసమయ్యాయి.

Exit mobile version